యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘ఇట్లు మీ ఎదవ’ చిత్రం నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. త్రినాధ్ కఠారి హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బళ్లారి శంకర్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే మంచి స్పందనను అందుకోవడంతో, సినిమాపై అంచనాలు పెరిగాయి.
చిత్రాన్ని నైజాం ప్రాంతంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేస్తుండగా, ఆంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేయనుంది. ఈ రెండు ప్రముఖ సంస్థల ద్వారా సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
సాహితీ అవాంచ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. దీనికి ట్యాగ్ లైన్ ‘వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు’ అని పెట్టారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించగా, జగదీష్ చీకటి డీఓపీగా, ఉద్ధవ్ ఎస్.బి. ఎడిటర్‌గా పనిచేశారు.
