ఇళయ దళపతి విజయ్, హన్సిక, శృతి హాసన్ నటీనటులుగా చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ సినిమాలో ‘ఈగ’ విలన్ సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ తమిళ సినిమాలో హన్సిక తల్లి పాత్రలో అతిలోక సుందరి శ్రీదేవి నటిస్తుంది. ఆమెతో కలసి నటించడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం అంటున్నాడు సుదీప్. మంగళవారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయింది.
గతంలో నేను బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలసి నటించాను. అతనికి దగ్గరగా వచ్చే ఏకైక నటి శ్రీదేవి మాత్రమే. ఒక గోప్ప నటితో కలసి నటించడం నా అదృష్టం. ఆమె గురించి ఏమని వర్ణించాలి’ అని సుదీప్ వ్యాఖ్యానించారు.


