నటుడిగా అది తన భాద్యత అంటున్న మోహన్ బాబు !

15th, February 2018 - 09:30:11 PM

మోహన్ బాబు హీరోగా నటించిన గాయత్రి సినిమా గతకొన్ని రోజుల ముందు విడుదలై మంచి టాక్ తో ముందుకు వెళ్తోంది. మదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు కథ మాటలు అందించారు. మోహన్ బాబు ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ.. సినిమాకు కుటుంబ ప్రేక్షకులనుంచి వస్తున్నఆదరణకు ఆనందంగా ఉందని తెలిపారు.

పైరసీ వల్ల చిత్రసీమకు జరగుతున్న అన్యాయానికి నిర్మాతగా బాధవేస్తుందని, చిత్రం విడుదలైన మొదటిరోజే కొందరు పైరసి చేస్తున్నారని అలంటి వారి చర్యలపై నిర్మాతగా తనకు భాదగా ఉందని చెప్పారు. అలాగే గాయత్రి చిత్రంలో కొన్ని డైలాగులపై చర్చ జరుగుతుందని, సన్నివేశానికి అనుగుణంగా రచయితలు రాసింది పలకడం నటుడిగా తన బాధ్యతని మోహన్ బాబు తెలిపాడు.