సమంత ఇన్స్టా పోస్ట్… పూజా కి కౌంటరా?

సమంత ఇన్స్టా పోస్ట్… పూజా కి కౌంటరా?

Published on May 30, 2020 12:16 PM IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా ఉన్న సమంత మరియు పూజ హెగ్డే మధ్య చిన్న డిస్టబెన్స్ చోటు చేసుకుంది. సమంత అందంపై పూజ హెగ్డే సోషల్ మీడియా అకౌంట్ లో ఓ నెగెటివ్ పోస్ట్ దర్శనం ఇచ్చింది. దానితో సమంత ఫ్యాన్స్ ఆమెపై సోషల్ మీడియా వేదికగా విరుకుపడ్డారు. ఐతే పూజ తనకేమి తెలియదు, ఆ పోస్ట్ నా ప్రమేయం లేకుండా జరిగింది, నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు అని సమాధానం చెప్పింది.

ఐతే పూజ మాటలు సమంత ఫ్యాన్స్ తో పాటు సమంత కూడా నమ్మినట్లు లేదు. అందుకే తనదైన శైలిలో సైటర్లు వేస్తుంది. ఇక గత రాత్రి సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ”మంచి మనసులు కలిగిన వారిని ఎదుటివారు తెలివితక్కువ వారిగా జమేస్తారు” అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సమంత పూజ హెగ్డే ని ఉద్దేశించే చేసిందని కొందరు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం పూజ హెగ్డే అక్కినేని అఖిల్ సరసన నటించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు