లెక్కలేనంత టాలెంట్ కి కొదవలేని క్రియేటివిటీకి టాలీవుడ్ పెట్టింది పేరు. అటువంటి యంగ్ టాలెంట్ ఈ మధ్య తరచూ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. గతవారం ‘అలా ఎలా?’ వంటి చిన్న సినిమా పెద్ద విజయం తరువాత మరో లో బడ్జెట్ సినిమా ‘ది ఎండ్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మా టి.వి షార్ట్ ఫిలిం కాంటెస్ట్ విజేత రాహుల్ ఈ థ్రిల్లర్ – హర్రర్ సినిమాను తెరకెక్కించాడు
అసలంటూ పబ్లిసిటీ లేకుండా విడుదలైన ఈ సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో విమర్శకుల ప్రశంసలు పొందుతూ మౌత్ పబ్లిసిటీద్వారా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలదొక్కుకుంటుంది. నిర్మాత కోటేశ్వరరావు అతి తక్కువ ఖర్చుతో సినిమా తీసి ఈ డిజిటల్ రివల్యుషణ్ లో భాగస్వామి అయ్యారు. ఈ సినిమాలో సుదీర్, గజల్ సోమయ్య మరియు పావని రెడ్డి నటించారు


