శుక్రవారం ఉదయం వెలువడిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల పట్ల ప్రముఖ దర్శకుడు ఏఅర్ మురుగదాస్ హర్షం వ్యక్తం చేశారు. గత అధ్యక్షుడు రాజపక్సే ఓటమి చెందడం ఈ ‘కత్తి’ దర్శకుడికి అమితానందం కలిగించింది.
‘కొత్త సంవత్సరంలో ఆరంభం అదిరింది. రాజపక్సే ఓటమిని అందరం సెలెబ్రేట్ చేసుకోవలసిన సమయం ఇది.’ అని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు తమిళ నాడు ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
శ్రీలంకలో తమిళులను ఊచకోత కోసిన రాజపక్సే పేరు వింటేనే తమిళనాడు ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మురుగదాస్ గత సినిమా ‘కత్తి’ విడుదలకు ముందు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేతలతో రాజపక్సేకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కొందరు ఆరోపించారు. సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించారు. నిర్మాతలు తమ పేరును టైటిల్ నుండి తొలగించడంతో సమస్య పరిష్కారమయ్యింది. ఇప్పుడు మురగదాస్ ట్వీట్ సంచలనం సృష్టించింది.


