సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎవరు’ !

Published on Aug 8, 2019 8:07 pm IST

వెంక‌ట్ రామ్‌జీ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా రెజీనా క‌సండ్ర హీరోయిన్‌ గా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ మూవీ ‘ఎవరు’. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. ఈ చిత్రానికి శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తుండగా.. వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పీవీపీ బ్యానర్ పై పరం వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పీవీపీ అండ్ అడవి శేష్ కాంబినేషన్ లో గతంలో క్షణం అనే హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సస్పెన్స్ రేకెత్తించే అంశాలతో పాటు సీరియస్ గా సాగే మర్డర్ కేసు గురించి చేసే విచారణ కూడా చాల బాగుంటుందని చిత్రబృందం చెబుతుంది. అలాగే రెజీనా, అడవి శేష్ మరియు నవీన్ చంద్ర పాత్రల మధ్య సాగే డ్రామా కూడా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట.

సంబంధిత సమాచారం :