సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అని తెలియడానికి మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. రేపు ఉదయం కల్లా లోకల్ మరియు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ పడిపోతాయి. కావున రేపు ఉదయం 11 కల్లా ఈ సినిమా టాక్ ఏంటనేది అందరికీ తేలిపోతుంది. అన్ని పనులు పూర్తి చేసిన ఈ చిత్ర టీం ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉండడమే కాకుండా రేపు ఆడియన్స్ చేత సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుందని ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చిత్ర టీం ఫైనల్ డే ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
ఇటీవలే చెన్నై వెళ్లి తమిళ వెర్షన్ ని ప్రమోట్ చేసిన మహేష్ బాబు అక్కడ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ప్రతి సినిమాలోనూ నటుడిగా తనని తానూ ఇంప్రూవ్ చేసుకునే మహేష్ ప్రస్తుతం తన డాన్సింగ్ స్కిల్స్ పై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. ‘నటుడు అనే వాడు పర్ఫెక్ట్ గా నటిస్తే చాలు డాన్సులు చేయాల్సిన అవసరం ఏముంది అని నమ్మే కొంతమంది నటుల్లో నేను ఒకడిని. కానీ నా గత కొన్ని సినిమాల నుంచి నా డాన్సింగ్ స్కిల్స్ మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను. అది ఈ సినిమాలో కూడా కనపడుతుందని’ తెలిపాడు. ఇప్పటికే రిలీజ్ అయిన చారుశీల సాంగ్ టీజర్ లో మహేష్ మైఖేల్ జాక్సన్ ని స్టైల్ స్టెప్స్ కొన్ని వేసి అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. ఆన్ స్క్రీన్ ఆ సాంగ్ ఇంకా హై లెవల్లో ఉంటుందని సమాచారం.
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు.


