రోడ్డు ప్రమాదానికి గురైన ‘జబర్ధస్త్’ చలాకి చంటి

రోడ్డు ప్రమాదానికి గురైన ‘జబర్ధస్త్’ చలాకి చంటి

Published on Jun 18, 2019 9:53 AM IST

chlaaki Chanti

‘జబర్దస్త్’ ఫేమ్ చలాకీ చంటి ఈ తెల్లవారుఝామున రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.విజయవాడ నుండి హైదరాబాద్ కి తన కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. కోదాడ మండలం కొమరబండ దగ్గర ఆయన ప్రయాణిస్తోన్న కారు ఆగివున్న లారీని వెనుకనుండి ఢీకొట్టింది.ఐతే ఈ ప్రమాదంలో చంటికి స్వల్ప గాయాలతో బయటపడ్డారని సమాచారం. వెంటనే ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ అతడికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం చలాకీ చంటి హైదరాబాద్‌కు బయల్దేరాడు.

ఇటీవలే హీరో వరుణ్ తేజ్ “వాల్మీకి” షూటింగ్ కొరకు బెంగుళూరు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నటులకు దిష్టి తగిలినట్లుంది, ఈ మధ్య వరుస ప్రమాదాలతో సతమవుతున్నారు.

తాజా వార్తలు