జబర్దస్త్ నటులు మరియు గబ్బర్ సింగ్ చిత్రంలో విలన్ బ్యాచ్ లో నటించిన ఫిష్ వెంకట్ తదితర నటులతో తెరకెక్కుతున్న చిత్రం ‘జబర్దస్త్ గబ్బర్ సింగ్’. యాక్షన్ కామెడీ హార్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి లేడీ డైరెక్టర్ సుజాత బొరియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సంధర్బంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాచకొండ చక్రధర్ మాట్లాడుతూ ఒక కొత్త కథ కథనం తో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రెండు గంటల పాటు ప్రేక్షకులును రంజింప చేసేలా ఒక సరికొత్త కధ కథనం తో వచ్చే నెల సినిమాను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అని అన్నారు. మరో నిర్మాత మోహన్ యాదవ్ మాట్లాడుతూ ప్రి క్లైమాక్స్ దశలో జబ్బర్ధస్త్ గబ్బర్ సింగ్ ఆర్టిస్టులతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న క్లాస్ మాస్ ఆడియన్స్ కి నచ్చేలా భారీ తారాగణం తో కొన్ని కీలక సన్నివేశాలాన్ని తెరకెక్కిస్తున్నము అన్నారు.
చిత్ర దర్శకురాలు సుజాత బౌరియా మాట్లాడుతూ ప్రి క్లయిమాక్స్ లో జబర్దస్త్ ఫేమ్ హైపర్ అది బ్యాచ్ మరియు గబ్బర్ సింగ్ ఫేమ్ ఫిష్ వెంకట్ బ్యాచ్ మధ్యలో జరిగే కామెడీ సన్నివేశాలు చిత్రీకరించాము. సినిమా లో ఈ రెండు బ్యాచ్ ల మధ్య జరిగే ప్రతి కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబూబ్బా నవ్విస్తాయి అందరూ చాలా బాగా నటించారు.
ఈ కథకు జబ్బర్ధస్త్ గబ్బర్ సింగ్ టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ప్రతి సన్నీ వేశాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్న. ఈ సినిమా టైటిల్ కి 100% నాయ్యం చేకూర్చేలా కథ డిమైండ్ మేరకు ఖర్చుకు వెనకడకుండా క్వాలిటీ కోసం తపించే నిర్మాతలు దొరకడం నా అదృష్టం గా భావిస్తున్నా.ఈ సినిమా తో ఒక కమర్షియల్ హిట్ అందుకుంటానని 100% కాన్ఫిడెన్స్ తో ఉన్న అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీ కోటి మాట్లాడుతూ ఈ చిత్రం లో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక ప్రత్యేక పాటను కంపోజ్ చేయడం జరిగింది. ఈ పాట కాసర్ల శ్యామ్ గారు రాశారు కథ డిమాండ్ మేరకు ఈ పాట చేయడం చాలా ఆనందం తో పాటు నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ పాట ప్రతి ఒక్కరినీ మెసమొరీస్ చేస్తు 2018 లో టాప్ టెన్ పాటల్లో మా పాట కూడా ఒకటిగా నిలిచిపోతుంది అని సంగీత దర్శకుడు శ్రీ కోటి తెలిపారు.


