సాహో స్పెషల్ సాంగ్ లో సల్మాన్ హీరోయిన్…!

Published on Aug 19, 2019 8:38 am IST

సాహో మేనియా ఇటు తెలుగు రాష్ట్రాలలతో పాటు దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిన విషయమే. గత రాత్రి రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన సాహో ప్రీ రీలీజ్ వేడుక వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో, అతిరధ మహారథుల మధ్య గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఇంకా 11రోజులలో మూవీ విడుదల కానుంది.

కాగా ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని గతంలో వార్తలు రావడం జరిగింది. ఆ స్పెషల్ సాంగ్ ని హీరోయిన్ ఎవ్లీన్ శర్మ చేశారని చెప్పడం జరిగింది. కాగా నిజానికి ఆ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ టాప్ తారలలో ఒకరైన జాక్విలిన్ పెర్నాండెజ్ నటిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రభాస్ జాక్విన్ తో కలిసి ఓ రొమాంటిక్ పోజ్ లో ఉన్న ఫోటో కొద్దిసేపటి క్రితం విడుదలై సోషల్ మాధ్యమాలలతో చక్కర్లు కొడుతుంది.

బాలీవుడ్ లో సల్మాన్ హీరోగా వచ్చిన కిక్, రేస్ 3 చిత్రాలతో పాటు అక్షయ్ సరసన హౌస్ ఫుల్ 3చిత్రాలలో ఈ శ్రీలంక బ్యూటీ నటించడం జరిగింది. తాజా వార్తతో ప్రభాస్, జాక్విలిన్ జోడిగా రానున్న ఆ స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటాడోనని ఫ్యాన్స్ అప్పుడే ఊహలలో తేలుతున్నారు.

సంబంధిత సమాచారం :