క్రిష్ – పవన్ సినిమాలో కీలక సన్నివేశం ?

క్రిష్ – పవన్ సినిమాలో కీలక సన్నివేశం ?

Published on May 31, 2020 12:06 AM IST

క్రిష్ – పవన్ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె యువరాణిగా కనిపిస్తుందట. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం
ఆమె పాత్ర సెకెండ్ హాఫ్ లో చనిపోతుందని, ఆమె చనిపోయే సన్నివేశం సినిమాలోనే కీలకం అని తెలుస్తోంది.

కాగా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ పేరున్న ఓ రాజుకి సోదరి పాత్రలో నటించబోతుందట. మరి ఇంతకీ ఆ రాజు ఎవరు? ఆ పీరియాడిక్ డ్రామా ఏమిటి? అనేది చూడాలి. ప్రస్తుతానికి, ఈ చిత్రం అయితే పాన్-ఇండియా రేంజ్ లో రూపొందుతుంది. అలాగే పవన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి.

అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు