ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ త్రయం

jagadeka veerudu

మన తెలుగు సినిమా నుంచి వచ్చిన కొన్ని క్లాసిక్ వండర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం “జగదేక వీరుడు అతిలోక సుందరి” కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ చిత్రం మళ్ళీ 35 ఏళ్ళు తర్వాత థియేటర్లులో రిలీజ్ అయ్యేందుకు వస్తుంది. అయితే ఈ చిత్రాన్ని ఏకంగా 3డి లో కూడా ఇపుడు రిలీజ్ చేస్తుండగా ఆడియెన్స్ మంచి ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు మేకర్స్ ప్రమోషన్స్ కూడా చేస్తుండడం విశేషం. ఇలా మెగాస్టార్ చిరంజీవి అలాగే దిగ్గజ నిర్మాత అశ్వినీదత్ మరియు దర్శకుడు రాఘవేంద్ర రావులు కలిసిన ఓ బ్యూటిఫుల్ ఫ్రేమ్ మంచి ఫోటో మూమెంట్ గా ఇపుడు వైరల్ గా మారింది. ఈ మే 9న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతున్న ఈ ఫాంటసీ వండర్ ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version