ఫ్యామిలీ హీరో కన్నింగ్ లాయర్ గా

Published on Aug 21, 2019 1:02 am IST

దర్శకుడు మెహర్ రమేష్, జగపతి బాబు కాంబినేషన్లో ఒక వెబ్ సిరీస్ మొదలుకానుంది. దీనికి సంబందించిన న్యూస్ ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా వినిపిస్తుంది. జగపతిబాబు ఈ వెబ్ సిరీస్ లో ఆడవాళ్ళ పట్ల అసభ్య ప్రవర్తన కలిగి వుండే కన్నింగ్ లాయర్ గా అతని పాత్ర ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన చిత్రీకరణ మొదలయ్యే అవకాశం కలదు.

ఇక జగపతి బాబు గతంలో గ్యాంగ్ స్టర్స్ అనే వెబ్ సిరీస్లో నటించిన సంగతి తెలిసిందే. ఒక్కప్పుడు మంచి ఫ్యామిలీ హీరోగా పేరున్న జగపతి బాబు హీరోగా కొంచెం అవకాశాలు తగ్గుముఖం పట్టాక, తెలివిగా లెజెండ్ చిత్రంతో విలన్ గా మారాడు. సెకండ్ ఇన్నింగ్స్ ఆయనకు బాగా కలిసొచ్చింది. సౌత్ ఇండియాలోనే కాస్ట్లీ యాక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు.

సంబంధిత సమాచారం :