కొరటాల సినిమాలో మహేష్ బాబు తల్లిగా సుకన్య

కొరటాల సినిమాలో మహేష్ బాబు తల్లిగా సుకన్య

Published on Jan 24, 2015 9:16 AM IST

Sukanya
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు తల్లిగా ఒకప్పటి హీరోయిన్ సుకన్య నటిస్తుందని సమాచారం. మొదట ఈ పాత్ర కోసం గ్రేసీ సింగ్, నదియ వంటి పలువురి హీరోయిన్ల పేర్లు ప్రస్తావనలోకి వచ్చాయి. అయితే, చివరికి ఈ పాత్ర సుకన్యకు దక్కింది. మహేష్ బాబు తండ్రిగా జగపతి బాబు నటిస్తున్నారు. 19992లో వచ్చిన సూపర్ హిట్ ‘పెద్దరికం’ సినిమాలో జగపతి బాబు, సుకన్య జంటగా నటించారు. మళ్లీ ఇన్నాళ్ళ తర్వాత కలిసి నటిస్తున్నారు.

మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పూర్ణ ప్రత్యేక గీతంలో నటిస్తుంది. మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మది సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు