పెద్ద మనసు చాటుకున్న జగ్గూ భాయ్.

Published on May 30, 2020 9:03 pm IST

ముక్కుసూటి తనానికి జగపతి బాబు మారుపేరు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పడం, అనిపించింది చేయడం జగపతి బాబు ప్రత్యేకత. ఇక ఫ్యామిలీ హీరోగా దశాబ్దాల పాటు కొనసాగిన జగపతి బాబు విలన్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారాక మరింత పేరు తెచ్చుకున్నారు. సౌత్ ఇండియాలోనే బెస్ట్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన అనేక చిత్రాలలో నటిస్తున్నారు.

కాగా సాయంలో కూడా తాను బెస్ట్ అని నిరూపించుకున్నాడు.కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పది వేల మంది సినీ కార్మికులకు నిత్యవసర సరుకులు అందజేశారు. గతంలో కూడా జగపతి బాబు సినీ కార్మికులకి సాయం చేశారు. ఒకటికి రెండు సార్లు సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. అలాగే పోలీసులకు మాస్కులు, శాటిటైజర్స్ అందజేశారు.

సంబంధిత సమాచారం :

More