ఎన్.టి.ఆర్ – సుకుమార్ సినిమాలో జగపతి బాబు.?

ఎన్.టి.ఆర్ – సుకుమార్ సినిమాలో జగపతి బాబు.?

Published on Feb 19, 2015 3:25 AM IST

ntr-agapathi-babu-sukumar
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తాజాగా విడుదలైన ‘టెంపర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పటికే ఎన్.టి.ఆర్ సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.. డిసెంబర్ లో అధికారికంగా లాంచ్ అయిన ఈ సినిమా మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఎన్.టి.ఆర్ – సుకుమార్ సినిమాలో జగపతి బాబు ఓ ముఖ్య పాత్ర పోషించనున్నాడు. ఈ పాత్ర సినిమాకి చాలా కీలకం అని అంటున్నారు.

ఎన్.టి.ఆర్ సినిమా తండ్రీ – కొడుకుల మధ్య అనుబంధం నేపధ్యంలో సాగే సినిమా అని ఇదివరకే సుకుమార్ తెలిపాడు. దీని ప్రకారం జగపతి బాబుని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం సెలక్ట్ చేస్తున్నారా లేక ఎన్.టి.ఆర్ తండ్రి పాత్ర కోసం సెలక్ట్ చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో సుకుమార్ ఎన్.టి.ఆర్ ని ఓ డిఫరెంట్ లుక్ లో చూపించే ఆలోచనలో ఉన్నారు. ఎన్.టి.ఆర్ – సుకుమార్ మూవీని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు