‘కథానాయకుడు’ తర్వాత మరోసారి ‘లింగ’లో రజినీకాంత్ తో కలసి నటించే అవకాశం జగపతి బాబుకి దక్కింది. ‘కథానాయకుడు’లో ప్రాణ మిత్రుడిగా నటిస్తే, ‘లింగ’ చిత్రంలో ప్రతి నాయకుడిగా రౌద్ర రసం పలికించబోతున్నారు జగపతి. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు వెర్షన్ డబ్బింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ శబ్దాలయా రికార్డింగ్ థియేటర్ లో జరుగుతున్నాయి. తన పాత్రకు జగపతి బాబు డబ్బింగ్ చెప్తున్నారు.
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా కధా నాయికలుగా నటించారు. ఏఅర్ రెహమాన్ సంగీతం అందించారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. ఇటివలే ఈ చిత్రంలో పాటలు విడుదలయ్యాయి. డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది.


