పెద్ది’ నుంచి అప్పలసూరి మేకింగ్.. బయట ఎవ్వరూ గుర్తు కూడా పట్టలేదు!

పెద్ది’ నుంచి అప్పలసూరి మేకింగ్.. బయట ఎవ్వరూ గుర్తు కూడా పట్టలేదు!

Published on Jun 3, 2026 4:43 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “పెద్ది” ఒక పవర్ ప్యాకెడ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా రేపు జూన్ 4న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా ఆరంభించిన సమయంలో దర్శకుడు బుచ్చిబాబు సానా తాలూకా నటీనటుల ఎంపిక ఏ లెవెల్లో టాపిక్ గా నడిచిందో తెలిసిందే.

ఒకో నటుడు తాలూకా లుక్, గెటప్స్ కోసం మంచి హాట్ టాపిక్ గా మారింది. అలా నటుడు జగపతి బాబు పోషించిన అప్పలసూరి రోల్ ఫస్ట్ లుక్ చూసి అంతా షాకయ్యారు. నిజంగా ఇది జగ్గూ భాయేనా అని అంతా ఆశ్చర్యపోయారు. అంతలా ఆ రోల్ మేకోవర్ షాకింగ్ గా మారింది. అయితే లేటెస్ట్ గా జగపతి బాబు మేకోవర్ పై విడుదల చేసిన మేకింగ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అందులో తనకి ప్రోస్థటిక్ మేకప్ వేసిన తర్వాత తనని తానే గుర్తు పట్టలేని విధంగా మారిపోయానని జగపతిబాబు చెప్పారు. అంతే కాకుండా బయట నిజంగానే తిరిగిన దృశ్యాలు కూడా షేర్ చేసి తనని బయట జనం ఎవ్వరూ కూడా గుర్తు పట్టలేదని ఆ రేంజ్ లో బుచ్చిబాబుకి తనని చూపించాలనే ఎలా ఊహించాడో నాకు తెలీదు కానీ నాకు తెలిసి ఇదే బెస్ట్ పాత్ర అవుతుంది అనే మాటని ప్రీరిలీజ్ నుంచి చెప్పిన క్లిప్ షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు. సో తన రోల్ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపిస్తుందో అనేది సినిమాతో తేలిపోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు