నార్త్ ఇండియన్ మూవీస్ లో మన స్టార్ యాక్టర్ !

Published on Aug 14, 2018 11:11 am IST


సీనియర్ హీరో జగపతి బాబు కథానాయడి నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత వరుస సినిమాలతో ప్రస్తుతం దక్షిణాది చలన చిత్ర పరిశ్రమల్లోనే ప్రధాన పాత్రలకు మరియు ప్రతినాయకుల పాత్రలకు అత్యంత ప్రాచుర్యం పొందారు. కాగా తాజాగా జగపతిబాబు, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’లో, చిరంజీవి సైరా లో, మరియు వైయస్ బయోపిక్ ‘యాత్ర’ చిత్రంలో ఇలా భారీ చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు.

కాగా జగపతిబాబు ఇప్పుడు నార్త్ ఇండియన్ చిత్ర పరిశ్రమలోకి కూడా ప్రవేశించబోతున్నారు. బోజపురి, పంజాబీ వంటి ప్రముఖ సినీ పరిశ్రమల నుండి ఆయనకు అవకాశాలు వస్తున్నాయట. సినీవర్గాల సమాచారం ప్రకారం బోజపురి చిత్రసీమకు చెందిన ఓ ప్రముఖ నిర్మాత ఇటీవలే జగపతిబాబును తమ చిత్రంలోని ఓ ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఐతే జగపతిబాబు కూడా ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. త్వరలోనే మన ఫ్యామిలీ హీరోని జాతీయ ప్రముఖ నటుడిగా చూడబోతున్నాం అన్నమాట.

సంబంధిత సమాచారం :

X
More