రవితేజ సినిమాలో జగపతిబాబు పాత్ర ఇదే !
Published on Mar 10, 2018 1:50 pm IST

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న నేలటికెట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు శక్తి కాంత్ సంగీతం అందిస్తున్నాడు అలాగే చోటా కెప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జగపతి బాబు ఈ మూవీ లో రాజకీయనాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. హీరో పాత్రకు సమానమైన రోల్ లో జగపతిబాబు నటించాడు.

రవితేజ, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయని సమాచారం. ఎస్‌ఆర్‌టీ మూవీస్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా శాటిలైల్‌ డిజిటల్‌ హిందీ డబ్బింగ్‌ రైట్స్ మొత్తం క‌లిపి రూ.25కోట్లకు ఒక ప్రముఖ ఛానల్ దక్కించుకోవడం విశేషం. ఈ మూవీ తరువాత ఏప్రిల్ నుండి శ్రీను వైట్ల సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు రవితేజ.

 
Like us on Facebook