4 సినిమాల తర్వాత స్టైల్ మార్చిన జగ్గు భాయ్

4 సినిమాల తర్వాత స్టైల్ మార్చిన జగ్గు భాయ్

Published on Oct 29, 2014 6:58 PM IST

Jagapathi-babu12
ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతి బాబు. ప్రస్తుతం జగపతి బాబు సోలో హీరోగా కంటే ఎక్కువగా విలన్ పాత్రలు, ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. జగపతి బాబు విలన్ గా చేసిన ‘లెజెండ్’ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడితో మొదలైన జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది.

జగపతి బాబు ‘లెజెండ్’ సినిమా నుంచి ఫుల్ గడ్డంతో ఉన్న లుక్ లో కనిపిస్తున్నాడు. లెజెండ్ తర్వాత చేసిన ‘రారా కృష్ణయ్య’, ‘కరెంట్ తీగ’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాల్లో కూడా ఫుల్ గడ్డం లుక్ లో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు. ‘రారా కృష్ణయ్య’ తర్వాత జగ్గు భాయ్ చేసిన ‘కరెంట్ తీగ’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఇలా నాలుగు సినిమాలు ఫుల్ గడ్డం లుక్ లో ఉన్న జగ్గు భాయ్ ఇప్పుడు ఫుల్ షేవ్ చేసి తన లుక్ మార్చాడు. ఇక నుంచి తన తదుపరి సినిమాల్లో ఫుల్ క్లాస్ లుక్ లో కనిపించనున్నాడు.

జగపతి బాబు ప్రస్తుతం రామ్ నటిస్తున్న ‘పండగ చేస్కో’, మహేష్ – కొరటాల సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల్లో గడ్డంలేని జగపతి బాబుని చూడచ్చు.

తాజా వార్తలు