ఆకట్టుకుంటున్న ‘జై బాలయ్య’ సాంగ్ మేకింగ్ వీడియో

ఆకట్టుకుంటున్న ‘జై బాలయ్య’ సాంగ్ మేకింగ్ వీడియో

Published on Dec 2, 2022 1:25 AM IST


నటసింహం నందమూరి బాలకృష్ణ తో ప్రస్తుతం యువ దర్శకడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ మూవీ వీరసింహారెడ్డి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఆకట్టుకోగా ఇటీవల ఈ మూవీ నుండి విడుదలైన జై బాలయ్య సాంగ్ మరింతగా అలరించి మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెంచేసిందనే చెప్పాలి.

థమన్ అందించిన మాస్ బీట్ కి కరీముల్లా గాత్రం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మరింతగా వన్నె తెచ్చాయి. ఆ విధంగా ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తున్న జై బాలయ్య సాంగ్ మేకింగ్ వీడియోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్. అవుట్ డోర్ లొకేషన్ లో పలువురు ప్రజల మధ్యన అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ మేకింగ్ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా వీరసింహారెడ్డి మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ గా కనిపించనున్నారు. ఇక ఈ మూవీని 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు