క్రేజీ కాంబో రిపీట్: ‘జై భీమ్’ దర్శకుడితో సూర్య 48వ చిత్రం!

క్రేజీ కాంబో రిపీట్: ‘జై భీమ్’ దర్శకుడితో సూర్య 48వ చిత్రం!

Published on Jun 29, 2026 7:01 PM IST

‘కరుప్పు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న స్టార్ హీరో సూర్య, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాడు. సూర్యకు ‘జై భీమ్’ వంటి సంచలన హిట్ అందించిన దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌తో మరోసారి చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాడు. సూర్య కెరీర్‌లో 48వ చిత్రాన్ని ఈ డైరెక్టర్ తెరకెక్కించనున్నాడు. ఒక నిజ జీవిత వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఈ సినిమాలో సూర్య సరసన కయాదు లోహర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతో నటించిన ఆమెకు, ఒక టాప్ స్టార్ సరసన నటిస్తున్న తొలి సువర్ణ అవకాశం ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తుండగా, ఎస్.ఆర్.కతీర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు