విశేషంగా ఆకట్టుకుంటున్న ‘జై లవ కుశ’ ట్రైలర్ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జై లవ కుశ’ యొక్క ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదలైంది. ఎన్నో రోజులుగా ట్రైలర్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్న అభిమానులు ట్రైలర్ విడుదలవగానే సోషల్ మీడియాలో పెద్ద హంగామానే సృష్టించారు. కొద్దిసేపటికే దాన్ని టాప్ ట్రెండింగ్స్ లో నిలబెట్టారు. ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉండటం, అందులోని కంటెంట్ సినిమాపై నమ్మకాన్ని పెంచేదిగా ఉండటంతో ట్రైలర్ కు మంచి ఆదరణ దక్కింది.

ఇప్పటికే అఫిషియల్ ఛానెల్ లో 2.8 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న ఈ ట్రైలర్ 1.4 లక్షలకు పైగా లైక్స్ ను కూడా పొందింది. మరోవైపు ఆడియో కూడా జనాలకు బాగానే రీచ్ అవడంతో సినిమా పట్ల పాజిటివ్ క్రేజ్ మరింత ఎక్కువైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ నెల 21న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేశారు.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి: