మరోసారి సీనియర్ డైరెక్టర్ తో బాలకృష్ణ !

Published on Apr 26, 2019 4:15 pm IST

నటసింహం నందమూరి బాలకృష్ణ కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘జై సింహా’. సి.కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది సంక్రాంతికి విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుంది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బోయపాటి శ్రీనుతో బాలయ్య సినిమా చేయాల్సివుంది. కానీ స్క్రిప్ట్ పూర్తికాకపోవడంతో ఈలోగా కె.ఎస్‌.రవికుమార్‌ సినిమాతో మొదలుపెట్టాలని బాలయ్య ఫిక్స్ అయ్యారట. దాంతో బోయపాటి మరో మూడు నెలల వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం :