మళ్ళీ జై సింహా కాంబినేషన్ లో సినిమా రాబోతుందా ?

మళ్ళీ జై సింహా కాంబినేషన్ లో సినిమా రాబోతుందా ?

Published on Jun 15, 2018 12:00 AM IST

balakrishna
బాలయ్య హీరోగా సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రం జై సింహా. ఈ చిత్రం మంచి హిట్ అయింది. ఏం రత్నం ఈ చిత్రానికి కథ మాటలు అందించారు. తాజా సమాచారం ప్రకారం ఏం రత్నం బాలయ్య కోసం మరో పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారట. బాలయ్యను కలిసి త్వరలోనే ఆ కథ చెప్పనున్నారని తెలుస్తోంది. ఆ కథ బాలయ్యకు నచ్చితే మళ్ళీ జై సింహా కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతుందన్నమాట.

ఏం రత్నం మాస్ కథలను రాయడంలో మంచి దిట్ట. రాజమౌళి సినిమాల్లో ఎక్కువ సినిమాలకి ఈయనే మాటలు రాశారు. బాలయ్య బాబు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న రత్నంకు , బాలయ్య మ్యానరిజమ్స్, డైలాగ్స్ మాడ్యులేషన్ బాగా తెలుసు. అలాంటిది ఆయన కథ రాశారంటే అవ్వన్నీ దృష్టిలో పెట్టుకునే రాస్తారు. కాబట్టి రత్నం గారి చెప్పే స్క్రిప్ట్ బాలయ్య బాబుకు నచ్చుతుందని తెలుస్తోంది. జై సింహా స్క్రిప్ట్ కూడా గంటలోనే ఒప్పించారు. మరి ఈ సారి కూడా అలాగే ఒప్పిస్తారేమో చూడాలి.

తాజా వార్తలు