సూపర్‌స్టార్ రజనీకాంత్, టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. సినిమాపై ఉన్న భారీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని దీన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.
ఇక నార్త్ బెల్ట్‌లోనూ ఈ సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో నార్త్‌లో ఈ చిత్రాన్ని ఏకంగా వెయ్యికి పైగా స్క్రీన్లలో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. రజినీ మ్యానియాతో నార్త్ కూడా ఊగిపోవడం ఖాయమని ఈ నెంబర్స్ చెబుతున్నాయి.
తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలవుతోంది. సన్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రజనీకాంత్‌తో పాటు ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, విద్యా బాలన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చగా, థియేటర్లలో తలైవర్ బాక్సాఫీస్ సునామీ చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


