సెన్సేషనల్ ఇంటర్వ్యూతో ‘రణబాలి’ ప్రమోషన్స్..!

సెన్సేషనల్ ఇంటర్వ్యూతో ‘రణబాలి’ ప్రమోషన్స్..!

Published on Oct 12, 2026 7:00 PM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలీ’ ప్రీ-రిలీజ్ వేడుక కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఒకే వేదికపై ఈ అందమైన జోడీని చూడటానికి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్టీజియస్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటరాక్షన్‌లో చిత్ర విశేషాలతో పాటు భారతదేశ చరిత్ర, వలసవాదం వంటి అంశాలపై ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పొలిటికల్ టచ్ ఇంటర్వ్యూ సినిమాపై ఎలాంటి హైప్ తీసుకువస్తుందో చూడాలి. ఈ స్పెషల్ ఇంటర్వ్యూ బుధవారం(అక్టోబర్ 14న) విడుదల కానుండగా, ప్రేక్షకులు మరియు సినీ వర్గాల్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

తాజా వార్తలు