అంతకంతకు ఆసక్తి పెంచుతున్న “జైలర్”.!

కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవర్ రజినికాంత్ హీరోగా లేటెస్ట్ గా అనౌన్స్ అయ్యిన చిత్రం “జైలర్” పై భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు దాదాపు షూటింగ్ దగ్గరకు కంప్లీట్ కావస్తుండడంతో సినిమా నుంచి ఇప్పుడు ఒకో అప్డేట్ మరింత ఆసక్తి రేపుతోంది. అయితే ఈ సినిమాలో ఉన్న క్యాస్టింగ్ వారి నుంచి రిలీజ్ చేస్తున్న లుక్స్ గాని ఆడియెన్స్ లో ఆసక్తి రేపుతున్నాయి.

మాములుగా రజిని లాంటి సాలిడ్ కటౌట్ ఉన్నప్పుడు ఇతర ఏ స్టార్ అయినా తన సినిమాలో అవసరం లేదు. కానీ ఇపుడు ఈ సినిమాలో మరింత మంది కీలక స్టార్ నటులు ఈ సినిమాకి లాక్ అవ్వడం అనేది ఇప్పుడు అదనపు ఆకర్షణగా మారింది. లేటెస్ట్ గా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ పోస్టర్, ఆ మధ్య తమన్నా సునీల్, శివన్న, మోహన్ లాల్ ఇలా అనేకమంది స్టార్స్ కలయికలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనితో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం సాలిడ్ హైప్ నెలకొంటుంది అని చెప్పాలి.

Exit mobile version