జైలర్ మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. సూపర్ స్టార్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద విద్వంసం సృష్టించాడు. జైలర్ చిత్రం మంచి రన్ తో భారీ వసూళ్ళు రాబట్టడం జరిగింది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా OTT లో కూడా దూసుకు పోతోంది. జైలర్ యొక్క గ్రాండ్ సక్సెస్ మీట్ ఈ రోజు చెన్నైలో జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత కళానిధి మారన్ యొక్క డెసిషన్ చాలా మంది హృదయాలను గెలుచుకుంది. సినిమాకు పనిచేసిన 300 మందికి పైగా బంగారు నాణేలతో సత్కరించారు. గతంలో రజనీ, అనిరుధ్, నెల్సన్‌లకు కూడా నిర్మాత కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చారు. జైలర్‌లో మోహన్‌లాల్ మరియు శివ రాజ్‌కుమార్ అతిధి పాత్రలు పోషించారు. బిగ్గీలో తమనా భాటియా, రమ్య కృష్ణ, జాకీ ష్రాఫ్, మర్నా మీనన్, సునీల్, నాగ బాబు, యోగి బాబు మరియు వసంత్ రవి ఇతర కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు.


