‘జేమ్స్‌బాండ్’.. ఇండియాకూ వచ్చేస్తున్నాడు!

James-bond
‘జేమ్స్‌బాండ్’.. హాలీవుడ్ సినిమాలతో పరిచయమున్న ప్రేక్షకులే కాకుండా, కేవలం తెలుగు సినిమాలనే చూస్ఏ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమున్న పేరు. జేమ్స్‌ బాండ్ క్యారెక్టర్ పేరుతో ఇప్పటివరకూ 23 సినిమాలు రాగా, ఇందులో చాలా సినిమాలు తెలుగులోనూ అనువాదమై ఇక్కడి ప్రేక్షకులనూ విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్‌లో 24వ సినిమా ‘స్పెక్టర్’ సినిమా నవంబర్ 20వ తేదీన దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విడుదల కాబోతోంది.

జేమ్స్ బాండ్‌గా డానియల్ క్రెయిగ్ నటించిన నాలుగో సినిమాయే స్పెక్టర్. 23వ జేమ్స్ బాండ్ సినిమా ‘స్కై ఫాల్‌’ను తెరకెక్కించిన శామ్ మెండిస్‌యే ఈ సినిమాకూ దర్శకత్వం వహించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా దీపావళికి ముందే రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియాలో మాత్రం ఈ వారమే విడుదలవుతోంది. ఇక ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా 20వ తేదీనే విడుదలవుతోంది. అయితే ‘చీకటి రాజ్యం’, ‘కుమారి 21F’ లాంటి క్రేజ్ ఉన్న సినిమాల వల్ల నవంబర్ 27వ తేదీకి గానీ స్పెక్టర్ అన్ని ప్రాంతాల్లో విడుదలయ్యే సూచనలు లేవు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కోసం జేబ్స్ బాండ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version