
వరుసపెట్టి సినిమాలు వస్తున్నా వాటి ఫలితంలో లెక్కలేకుండా అల్లరి నరేష్ తదుపరి సినిమాపై అంచనాలు ఏర్పడడం సహజం. మరోసారి జేమ్స్ బాండ్ చిత్రం ద్వారా మనల్ని పలకరించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విజయంపై చిత్రబృందం చాలా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఈరోజు గుమ్మడికాయ ఫంక్షన్ ని జరుపుకుంది. .
నరేష్ గత చిత్రాలు పరాజయం పాలవడంతో ఈ సినిమా అతని కెరీర్ కి ఇంపార్టెంట్ గా మారింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించాయి జేమ్స్ బాండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు దర్శకుడు సాయి కిషోర్. అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందాల భామ సాక్షి చౌదరి హీరోయిన్.

