
బాండ్ ‘జేమ్స్ బాండ్’ అంటూ త్వరలో మనముందుకు రానున్నాడు టాలీవుడ్ అల్లరోడు అల్లరి నరేష్. కానీ హాలీవుడ్ లో వచ్చే జేమ్స్ బాండ్ సినిమాలు స్టన్నింగ్ యాక్షన్ సేపిసోడ్స్, విజువల్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తే ఈ జేమ్స్ బాండ్ మాత్రం థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడట. అందుకే టైటిల్ లోనే జేమ్స్ బాండ్ తను కాదని ‘నేను కాదు నా పెళ్ళాం’ అనే ట్యాగ్ లైన్ ని పెట్టారు. ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్ ని తెగ నవ్విస్తుందని అల్లరి నరేష్ తో పాటు ఈ చిత్ర టీం కూడా నమ్మకంగా ఉన్నారు.
మాఫియా డాన్ అయిన పెళ్ళాం అల్లరోడిని పెట్టే టార్చర్ చాలా కామెడీగా ఉంటుందని అంటున్నారు. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాని జూలై 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అల్లరోడికి చుక్కలు చూపించే మాఫియా డాన్ వైఫ్ గా సాక్షి చౌదరి నటించింది. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది కాకుండా అల్లరి నరేష్ – కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కాంబినేషన్ లో శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.