ఇప్పుడు తమిళ్ సినిమా సహా తెలుగు ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే ‘జన నాయగన్’. దర్శకుడు హెచ్ వినోద్ తెరక్కేకించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాని నటసింహ బాలయ్య నటించిన సూపర్ హిట్ చిత్రం భగవంత్ కేసరికి రీమేక్ గా రూపొందించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో వినోద్ బాలయ్యపై చేసిన కామెంట్స్ ఇపుడు ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.
బాలకృష్ణ గారు కేవలం ఒక సినీ స్టారో లేక ఓ సాధారణ మనిషో కాదని ఆయన దైవ సమానులు అంటూ తాను కామెంట్స్ చేయడం బాలయ్య ఫ్యాన్స్ లో ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. అంతే కాకుండా అంతా పిలుచుకునే జై బాలయ్య స్లోగన్ కోసం కూడా వినోద్ చెప్పడం జరిగింది.
జై బాలయ్య అనే స్లోగన్ సాధారణ క్లాప్ లాంటిది కాదని అదో పవర్ఫుల్ స్లోగన్ అంటూ తాను చెప్పడం ఇప్పుడు ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. మరి బాలయ్య సినిమాని రీమేక్ చేసి తనపై ఈ రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వడం అనేది ఫ్యాన్స్ లో జన నాయకుడు సినిమాని తాను ఎలా తెరకెక్కించారు అనే ఆసక్తిని కూడా పెంచినట్టు అయ్యింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ఈ 23 వరకు ఆగాల్సిందే.


