‘జన నాయకుడు’కి తిప్పలు తప్పవా..? ఇదే నిజమైతే కష్టమే..!

‘జన నాయకుడు’కి తిప్పలు తప్పవా..? ఇదే నిజమైతే కష్టమే..!

Published on Dec 23, 2025 11:33 PM IST

Jana-nayagan

తమిళ హీరో విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ తన చివరి చిత్రం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాను టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా రూపొందిస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే, ఈ సినిమాకు తమిళంలో సాలిడ్ క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు అక్కడ తారాస్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇదే నమ్మకంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ ‘జన నాయకుడు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. దీని కోసం ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ చిత్ర హక్కులను దక్కించుకునేందుకు ప్రయత్నించారట. కానీ, తెలుగులో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ కావడం లేదని ఆయన ఇప్పుడు ఈ సినిమా నుండి వెనకడుగు వేసినట్లు సినీ సర్కిల్స్ టాక్. మరి ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పొంగల్ కానుకగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు