ఆ హిట్ మూవీ సీక్వెల్ లో జాన్వీ కపూర్

Published on Jun 27, 2019 9:26 pm IST

జాన్ అబ్రహం,అభిషేక్ బచ్చన్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలలో డైరెక్టర్ తరుణ్ మాన్సుఖాని తెరకెక్కించిన మూవీ “దోస్తానా”. యాష్ జోహార్,కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించగా 2008లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పడు ఈ మూవీకి కొనసాగింపుగా “దోస్తానా2” తెరకెక్కనుంది. చిత్ర నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించారు.

మరో విశేషం ఏమిటంటే ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఒక హీరోగా కార్తీక్ ఆర్యన్ ఎంపిక చేయగా మరో నటుడిని ఎంపిక చేయాల్సివుంది. ధఢక్ మూవీతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్,ప్రస్తుతము ఓ బయోపిక్ లో నటిస్తుంది. “దోస్తానా 2” ఆమెకు మూడవ చిత్రం. కరణ్ జోహార్, హీరో జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్న ఈ మూవీకి కాలిన్ డి కన్హా దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More