జాన్వీ కపూర్ ను ముద్దు అడిగిన అభిమాని !

Published on Mar 22, 2021 4:01 pm IST

షల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య జనం వ్యవహార శైలి మరీ మితిమీరిపోతుంది. తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను ఒక నెటిజన్ ఏకంగా ముద్దు పెట్టమని అడిగాడు. ప్రస్తుతం జాన్వీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ‘దఢక్‌’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన జాన్వీ తన నటనతో పాటు తన గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. ఇక సినిమాల సంగతి పక్కకు పెడితే..

ఈ మధ్య సోషల్ మీడియాలోనూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వ్యక్తిగత విషయాలతో పాటు తన సినిమా అప్డేట్స్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ పేరుతో తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించగా.. ఓ అభిమాని ఏకంగా మనం ముద్దు పెట్టుకుందామా అని జాన్వీని అడిగాడు. ఐతే అతనికి సమాధానం చెప్తూ మాస్క్ ధరించిన ఫోటో పెట్టి నో అంటూ రిప్లై ఇచ్చింది జాన్వీ.

సంబంధిత సమాచారం :