జాన్వీ వల్ల అక్కడ విజయ్ పేరు మారుమోగుతోంది !

జాన్వీ వల్ల అక్కడ విజయ్ పేరు మారుమోగుతోంది !

Published on Nov 26, 2018 5:30 PM IST


విజయ్ దేవరకొండ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైందే. ‘అర్జున్ రెడ్డి’ విజయ్ కెరీర్ ను మార్చేసింది. దాంతో విజయ్ కి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ పేరు బాలీవుడ్ లో కూడా మారుమోగుతుంది. దీనికి కారణం శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఇక విషయానికి వస్తే బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ అనే షో లో జాన్వీ తన అన్న అర్జున్ కపూర్ తో కలిసి షో కి గెస్ట్ గా హాజరైయింది. ఈ షో లో కరణ్ , జాన్వీ ని ఒక రోజు ఉదయాన్నే నువ్వు మేల్ యాక్టర్ గా నిద్ర లేస్తే ఎవరిలా ఉండాలని అని అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ అని సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా విజయ్ ట్యాలెంటెడ్ యాక్టర్ అని కితాబ్ ఇచ్చింది.

ఇక హిందీలో ఆంత మంది యువ హీరోలు ఉండగా జాన్వీ , విజయ్ పేరు చెప్పడంతో అక్కడివారు విజయ్ గురించి నెట్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి ఒక్క సినిమా తో విజయ్ ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకొని తన ఇమేజ్ ని రోజు రోజుకి పెంచుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు