త్వరలో తిరిగి షూటింగ్ ప్రారంభించనున్న బడా సినిమాలు.

gopala-gopala-temper

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండు బడా సినిమాలు ‘గోపాల గోపాల’, ‘టెంపర్’ షూటింగులు కొంత గ్యాప్ తర్వాత త్వరలో తిరిగి ప్రారంభం కానున్నాయి. వారణాసి షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ‘గోపాల గోపాల’ యూనిట్ విశ్రాంతి తీసుకుంటుంది. మొదట ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికుల స్ట్రైక్, తర్వాత నందమూరి జానకిరామ్ మరణంతో ‘టెంపర్’ షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం అవుతూ వచ్చింది.

గురువారం నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘గోపాల గోపాల’ షూటింగ్ మొదలవుతుంది. కృష్ణాష్టమి సాంగ్ చిత్రీకరించనున్నారు. డిసెంబర్ 26 నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ – పూరి జగన్నాధ్ ల ‘టెంపర్’ షూటింగ్ ప్రారంభమవుతుంది.

షూటింగ్ ఆలస్యం కావడం వలన ‘టెంపర్’ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని ఫిల్మ్ నగర్ టాక్. ముందుగా ప్రకటించినట్టు ‘గోపాల గోపాల’ను జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version