మెగా హీరో ఉరమాస్ ఐటెం సాంగ్ లో

Published on Aug 20, 2019 11:03 pm IST

వాల్మీకి చిత్రంలో వరుణ్ మునుపెన్నడూ చేయని ఉరమాస్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. నల్లని బట్టలు, పెరిగిన జులపాలతో భయంకరంగా ఉన్న వరుణ్ లుక్ కి ఇప్పటికే విశేష స్పందన లభించింది. మరి హీరో అంత ఊర మాస్ పాత్ర చేస్తున్నప్పుడు ఒక డబుల్ ఊర మాస్ ఐటెం సాంగ్ అనేది సర్వసాధారణం. మరి ఆ మాస్ బీట్ సాంగ్ లిరికల్ వీడియో ని రేపు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.

జర్రా… జర్రా… అనేలిరిక్స్ తో సాగే ఈఐటెం సాంగ్ లో డింపుల్ హయ్యత్ వరుణ్ సరసన ఆడి పాడ నుంది. ఈనెల 22న పూర్తి వీడియో సాంగ్ విడుదల చేయనున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 13న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :