నైజాంలో దూసుకెళ్తున్న “జాతి రత్నాలు”.!

Published on Mar 14, 2021 3:00 pm IST

ఈ ఏడాది మన టాలీవుడ్ లో విడుదల కాబడిన అన్ని చిత్రాల్లో మంచి హైప్ తో విడుదలయ్యి అదే హైప్ ను అందుకొని బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో “జాతి రత్నాలు” కూడా ఎంటర్ అయ్యిపోయింది చెప్పాలి. అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన హిలేరియస్ ఎంటర్టైనర్ “జాతి రత్నాలు”.

మొదటి రోజు నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకొని అన్ని ఏరియాల్లో కూడా సూపర్బ్ వసూళ్లను రాబడుతుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో అయితే సాలిడ్ వసూళ్లతో అదరగొడుతున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గత గురువారం విడుదల కాబడిన ఈ చిత్రం మూడో రోజు వసూళ్లు రెండో రోజు కంటే ఎక్కువ వచ్చాయట.

ఈ శుక్రవారం 1.90 కోట్లు రాబట్టగా శనివారం మాత్రం 2.33 కోట్లు రాబట్టింది. దీనితో అక్కడ ఈ చిత్రం ఎంత స్ట్రాంగ్ గా నిలబడిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక అలాగే ఈ ఆదివారం కూడా సెలవు దినం కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పాలి. మొత్తానికి మాత్రం ఈ ఎంటర్టైనర్ ఫైనల్ గా కూడా మంచి మార్క్ దగ్గరే ఆగుతుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :