ఓవర్సీస్ మార్కెట్ ‘జాతిరత్నాల’ మార్క్

Published on Mar 12, 2021 11:00 pm IST

నిన్న గురువారం విడుదలైన సినిమాల్లో ‘జాతిరత్నాలు’ మంచి టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ రెండు రోజుల్లో సినిమా దూకుడు చూస్తే భారీ లాభాలు ఖాయంగా కనిపిస్తోంది. నిన్న మొదటిరోజు సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 3.64 కోట్ల షేర్ రాబట్టుకుంది. ‘ఉప్పెన, క్రాక్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ కోలుకోవడానికి ఉపకరించగా ‘జాతిరత్నాలు’ దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాయి. ఈ దెబ్బతో ప్రేక్షకులకు థియేటర్లకు రావడం మీద ఎలాంటి సంకోచం లేదని తేలింది.

ఇక ఓవర్సీస్ మార్కెట్ విషయానికొస్తే అక్కడ కూడ కరోనా దెబ్బతో తెలుగు సినిమాలు పూర్తిగా నిలిచిపోయాయి. ‘ఉప్పెన, క్రాక్’ సినిమాలు విడుదలైనప్పటికీ అవి యూఎస్ బాక్సాఫీస్ మీద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే ‘జాతిరత్నాలు’ మాత్రం అక్కడి మార్కెట్ కోలుకోవడానికి కొంత ఉపకరించిందనే అనాలి. ప్రీమియర్ షోల ద్వారానే సినిమా 1,25,000 డాలర్లను రాబట్టుకోగా నిన్న గురువారంతో కలిపి మొత్తం 2,31,000 డాలర్లను ఖాతాలో వేసుకుంది. ఈ వసూళ్లతో యూఎస్లో తెలుగు సినిమాల మార్కెట్ మరోసారి ట్రాక్లో పడ్డట్టే అనుకోవాలి.

సంబంధిత సమాచారం :