“జాతి రత్నాలు” లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Mar 16, 2021 3:33 pm IST

నవీన్ పోలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణలు మరో కీలక పాత్రల్లో నటించిన “జాతి రత్నాలు” బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రం విడుదల కాబడిన మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. సోమవారం నాడు ఈ సినిమా నైజాంలో 1.54 కోట్ల వసూళ్లను సాధించింది.

కాగా ఉదయపు ప్రదర్శనలలో కొంత నిస్తేజమైన ఆక్యుపెన్సీ వచ్చినా, మధ్యాహ్నం ప్రదర్శనల నుండి, సాయంత్రం మరియు రాత్రి ప్రదర్శనలలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఫైనల్ గా మొదటి వారాంతానికి సెన్సేషనల్ 20 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. మేకర్స్ ఇప్పటికే భారీ లాభాలలో ఉన్నారు.

కాగా అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పటికే అనేక ప్రముఖుల నుంచి నవీన్ కు ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం :