జయలలిత బయోపిక్ టైటిల్ ఖరారు !

జయలలిత బయోపిక్ టైటిల్ ఖరారు !

Published on Sep 20, 2018 8:05 PM IST

Iron lady

అలనాటి నటి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురిచ్చి తలైవి జయలలిత జీవితం ఆధారంగా తమిళ దర్శకురాలు ప్రియదర్శిని బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. కొద్దీ నిమిషాల క్రితం ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈచిత్రం యొక్క టైటిల్ పోస్టర్ ను విడుదలచేశారు. ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో రానున్న ఈచిత్రంలో యువ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ జయలలిత పాత్రలో నటించనుంది. పేపర్ టేల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం లాంచ్ వేడుక త్వరలోనే గ్రాండ్ గా జరుగనుంది.

ఇక ఇదిలా ఉంటే యువ నిర్మాత విష్ణు ఇందూరి కూడా జయలలిత మీద బయోపిక్ ను నిర్మిస్తున్నానని ఇదివరకే ప్రకటించారు. ఏ ఎల్ విజయ్ తెరకెక్కించనున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న లాంచ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు