అల్లు అర్జున్ 19 లో మళయాలం నటుడు ?

Published on Apr 21, 2019 2:47 pm IST

నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ తన 19వ చిత్రంలో నటించనున్నాడు. ఇటీవలే ఈచిత్రం లాంచ్ కాగా ఈనెల 24నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది.

ఇక ఈ చిత్రంలో బోమన్ ఇరానీ , టబు , సుశాంత్ , నవదీప్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మారో స్టార్ నటుడు ఈజాబితాలో చేరిపోయాడు. అయన ఎవరో కాదు మలయాళ యాక్టర్ జయరామ్. ఈచిత్రంలో జయరామ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్. అయితే ఈ స్టార్ క్యాస్టింగ్ ఫై అధికారిక సమాచారం వెలుబడాల్సి వుంది.

ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించనుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ , గీతాఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని తమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :