రామ్ చరణ్ కి తల్లిగా జీవితా రాజశేఖర్.?

రామ్ చరణ్ కి తల్లిగా జీవితా రాజశేఖర్.?

Published on Feb 22, 2015 5:13 PM IST

Ram_Charan_Jeevitha-Rajasek
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – దర్శకుడు శ్రీనువైట్లల పవర్ ఫుల్ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్ పైకి వెళ్లనుంది. ప్రముఖ నిర్మాత దానయ్య డి.వి.వి. ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్న ఈ భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం మార్చి 5న ప్రారంభం అవుతోంది. ఇప్పటిక్ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా ఖరారు చేసారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథా పరంగా రామ్ చరణ్ తల్లి పాత్రకి ప్రాముఖ్యత ఉంటుంది. ఆ పాత్ర కోసం జీవితా రాజశేఖర్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎక్కువ భాగం జీవిత రాజశేఖర్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఈ చిత్ర టీం ఉన్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై కచ్చితమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.

గతంలో చిరంజీవి ఫ్యామిలీకి రాజశేఖర్ ఫ్యామిలీకి కాస్త మనస్పర్ధలు ఉండేవి. అవి ఈ మధ్యే తొలగిపోయాయని రాజశేఖర్ తెలియజేశాడు. మరి అనుకున్నట్లు గానే జేవిత రాజశేఖర్ రామ్ చరణ్ కి తల్లిగా నటిస్తే వీరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగినట్లే అని భావించవచ్చు. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటూనే రామ్ చరణ్ అభిమానులు కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. రామ్ చరణ్ సినిమాకి మూలకధ స్క్రీన్ ప్లే-దర్సకత్వం శ్రీనువైట్ల అందిస్తే, కధను కోనవెంకట్ – గోపీమోహన్ లు అందిస్తున్నారు. సంభాషణలను కోన వెంకట్ రాయనున్నాడు.

అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 16న మొదలు కానుంది. ఈ చిత్ర టీం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 15న ఈ సినిమా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు