కొత్తగా నియమించిన 9 మంది సభ్యుల సెన్సార్ బోర్డ్ అఫ్ సర్టిఫికేషన్ (సిబిఏఫ్‌సి)లో ప్రముఖ దర్శకురాలు, ఒకప్పటి హీరోయిన్ జీవితకు చోటు కల్పించింది నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ సినిమా సెన్సార్ విషయంలో తలెత్తిన వివాదం వలన గత సెన్సార్ బోర్డు చీఫ్ లీలా శాంసన్ తో పాటు ఇతర సభ్యులుకూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసి రెండు రోజులు కూడా గడవక ముందే కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త సెన్సార్ బోర్డుకు ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలానిను సిబిఏఫ్‌సి చైర్మెన్. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా జీవిత రాజశేఖర్ సినిమా రంగానికి తన సేవలను అందించారు. గత కొంత కాలంగా ఆమె భర్త రాజశేఖర్ హీరోగా సినిమాలు నిర్మిస్తున్నారు. వీరి ప్రొడక్షన్లో నిర్మిస్తున్న తాజా సినిమా ‘గడ్డం గ్యాంగ్’ చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.


