తెలుగు రాష్ట్రాల్లో జెర్సీ మొదటి రోజు కలెక్షన్స్ !

Published on Apr 20, 2019 2:17 pm IST

న్యాచురల్ స్టార్ నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ నిన్న విడుదలై ఎక్స్ట్రార్డినరీ రివ్యూస్ ను రాబట్టుకుంది. అయితే అదే రోజు కాంచన 3 కూడా విడుదలకావడంతో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టుకోలేకపోయాడు. బిసి సెంటర్లో ఈచిత్రానికి కాంచన 3 గట్టి పోటీనిచ్చింది. దాంతో జెర్సీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.6 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి మౌత్ టాక్ కూడా బాగుండడంతో నిన్నటికి కన్నా ఈరోజు ఎక్కువగా కలెక్షన్స్ ను రాబట్టుకునే అవకాశాలు వున్నాయి.

ముఖ్యంగా ఈ చిత్రం మల్టిఫ్లెక్స్ ల్లో సత్తాచాటుతుంది. ఇక ఈ చిత్రం అటు ఓవర్సీస్ లో కొంచెం స్లో గా స్టార్ట్ చేసినా ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రం శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించారు. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది

సంబంధిత సమాచారం :