జెర్సీ, కాంచన 3 లేటెస్ట్ కృష్ణా కలెక్షన్స్ !

Published on Apr 21, 2019 11:45 am IST

మొన్న విడుదలైన జెర్సీ , కాంచన 3 తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా జెర్సీ మల్టీఫ్లెక్స్ ల్లో హావ కొనసాగిస్తుండగా కాంచన 3 బిసి సెంటర్లలో మంచి రన్ ను కనబరుస్తుంది.

ఇక కల్లెక్షన్ల విషయానికి వస్తే కృష్ణా లో జెర్సీ రెండవ రోజు 20,06,754 షేర్ తో రెండు రోజుల్లో 53,65,377 షేర్ ను రాబట్టుకోగా కాంచన 3 రెండవ రోజు 16,36,765 షేర్ తో 46,50,000 షేర్ ను రాబట్టి జెర్సీ కి గట్టిపోటీనిస్తుంది. ఇక ఈ రోజు ఆదివారం కావడం వలన మూడో రోజు కూడా ఈ రెండు సినిమాల వసూళ్ల మరింత పెరిగే అవకాశం వుంది.

సంబంధిత సమాచారం :